డిగ్రీ పరీక్ష రాయడానికి వెడుతుంటే ఆటో బోల్తా, పదిమంది విద్యార్థులకు గాయాలు.. ఎమ్మెల్యేలు రసమయి, మంత్రి గంగుల

రాజన్నసిరిసిల్ల జిల్ల తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ వద్ద డిగ్రీ పరీక్ష రాయడానికి సిరిసిల్లకు విద్యార్థులతో వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంట్లో ప్రయాణిస్తున్న పదిమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటో ప్రమాదం లో గాయపడి సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇల్లంతకుంట మండలంకు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులను ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్,సుంకే రవిశంకర్ తో కలసి మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

First Published Mar 19, 2022, 11:28 AM IST | Last Updated Mar 19, 2022, 11:28 AM IST