Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఎంబసీ... ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఆస్ట్రేలియా హైకమిషనర్ భేటీ

Mar 10, 2021, 6:38 PM IST

హైదరాబాద్: ఆస్ట్రెలియా హైకమిషనర్ హ బారీ ఓ ఫారెల్ ఎవో, కన్సోల్ జనరల్  సారాకిర్లూ,  ఎకనమిక్ కౌన్సిలర్ పెర్సీబెల్ ఇవాళ  ఆర్థిక మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులను గూర్చి వారు మంత్రిని అడిగి తెలుసుకున్నారు.  దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కోవిడ్ మహమ్మారి నుండి వేగంగా కోలుకుందని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని  హరీశ్ రావు చెప్పారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగం పుంజుకుంటోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబుడలు పెట్టే అంశంపైన వారు రాష్ట్రంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సోలార్ పవర్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లకు అనువుగా ఉంటుందని మంత్రి చెప్పారు. 

సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైస్ పార్కు గూర్చి వారికి మంత్రి హరీశ్ రావు వివరించారు. దేశంలో తెలంగాణలోనే తొలి మెడికల్ డివైస్ పార్కు ఇదని, ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదిస్తున్నట్లు చెప్పారు.  దీంతో పాటు రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయం, సాగు నీరు అంశాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో ఎంబసీ పెట్టేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని దీనిపై పరిశీలిస్తామని హైకమీషనర్ మంత్రికి చెప్పారు.