Telangana News:తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రారంభం... బార్డర్ వద్దే ఏపీ ధాన్యం నిలిపివేత

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతులనుండి ధాన్యం కొనుగోలుకు ప్రారంభించింది.

First Published Apr 15, 2022, 12:38 PM IST | Last Updated Apr 15, 2022, 12:38 PM IST

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు రైతులనుండి ధాన్యం కొనుగోలుకు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేసినప్పటికి అందుకు మోదీ సర్కార్ అంగీకరించలేదు. దీంతో రైతుల నుండి వ్యతిరేకత రాకముందే ఎప్పటిలాగే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ్టి(శుక్రవారం) నుండి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం తెలంగాణకు తరలకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ధాన్యం రాకుండా అడ్డుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ తో పాటు తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ-ఏపీ బోర్డర్ లో భారీగా ధాన్యం లారీలు నిలిచిపోయాయి. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో గత రాత్రి నుండి బోర్డర్ వద్దే లారీ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే ఇలా ధాన్యం లారీల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్న డ్రైవర్లు చెబుతున్నారు.