konaseema violance:అమలాపురం అల్లర్ల కేసులో మరో 25మంది అరెస్ట్
అమలాపురం: కొనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన వివాదం అమలాపురంలో అల్లర్లకు కారణమయ్యింది
అమలాపురం: కొనసీమ జిల్లా పేరుమార్పుపై చెలరేగిన వివాదం అమలాపురంలో అల్లర్లకు కారణమయ్యింది. రాజ్యాంగనిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జల్లాపేరుకు జోడించాలన్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో అల్లర్లు సృష్టించిన వారిని ఇప్పటికే గుర్తించి అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. శనివారం కూడా మరో 25మందిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు వెల్లడించారు. అమలాపురం అల్లర్ల కేసుపై కోనసీమ ఎస్పీ కార్యాలయంలో డిఐజి మీడియాతో మాట్లాడారు. శనివారం కొందరిని అరెస్ట్ చేయగా ఆదివారం కూడా అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు. అల్లర్లలో ద్వంసమైన ఆస్తుల నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని... ఇందుకోసం వారి ఆస్తులను సీజ్ చేస్తామన్నారు. వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్ లాంటి సాంకేతిక ఉపయోగించి ఇప్పటికే నిందితులను గుర్తించినట్లు... వారి అరెస్టులే కొనసాగుతున్నాయని డిఐజి పాలరాజు తెలిపారు.