Asianet News TeluguAsianet News Telugu

గోల్కొండలో కనిపించింది చిరుత కాదు మానుపిల్లి..

గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో చిరుత పులి లేదా పాంథర్ తిరుగుతోంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అటవీ శాఖ తెలిపింది.

గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో చిరుత పులి లేదా పాంథర్ తిరుగుతోంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అటవీ శాఖ తెలిపింది. అది చిరుత కాదని సివిట్ క్యాట్ (మాను పిల్లి) అని అటవీశాఖ చెబుతోంది. చిరుత అంటూ స్థానికులు అందించిన సమాచారంతో స్పందించిన అటవీశాఖ ఈ ఉదయం దానిని బంధించి జూపార్కు కు తరలించారు. దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని PccF ఆర్. శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది.