భోలక్ పూర్ సీన్ పాతబస్తీలో రిపీట్... పోలీసులతో ఎంఐఎం కార్పోరేటర్ వాగ్వివాదం

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పోలీసుల పరిస్థితి మరీ దయనీయంగా తయారయ్యింది. 

First Published Apr 7, 2022, 1:01 PM IST | Last Updated Apr 7, 2022, 1:01 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పోలీసుల పరిస్థితి మరీ దయనీయంగా తయారయ్యింది. ఇటీవల ముషీరాబాద్ పరిధిలో బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మీరు వంద రూపాయిల మనుషులంటూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారితో దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే పాతబస్తీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో పాతబస్తీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగి వారి విధులకు ఆటంకం కల్పించేలా వ్యవహరించారు. మక్కామసీద్ లో ప్రార్థనల కోసం వచ్చేవారు యునాని హాస్పిటల్ ముందే వాహనాలను పార్కింగ్ చేస్తుండటంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తన సిబ్బందితో కలిసి స్థానిక ఎస్సై అక్కడికి చేరుకుని వాహనాలను తీసివేయాలని కోరారు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఎంఐఎం కార్పోరేటర్ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ కార్పోరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ ఉన్నతాధికారులు కార్పోరేటర్ తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.