మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళన

హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

First Published Jul 7, 2022, 5:18 PM IST | Last Updated Jul 7, 2022, 5:18 PM IST

హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజి సిలిండర్లతో కుత్భుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లో మహిళా నాయకులు రోడ్డెక్కారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి. వివేకానంద గౌడ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.  కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.   ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ లు, కౌన్సిలర్లు, ఇతర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో,  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఆందోళన చేపట్టారు.