Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ జూలో ఆఫ్రికన్ సింహం పిల్లలు.. ఎంత క్యూట్ గా ఉన్నాయో..

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో నెల రోజుల వయసున్న రెండు సింహం పిల్లలు సందడి చేస్తున్నాయి.

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో నెల రోజుల వయసున్న రెండు సింహం పిల్లలు సందడి చేస్తున్నాయి. అధిసన అనే ఆఫ్రికన్ ఆడ సింహానికి నెల రోజుల క్రితం రెండు పిల్లలు పుట్టాయి. అవి ఆదివారం నాడు మొదటిసారిగా తల్లితో కలిసి బైటికి వచ్చాయి. తప్పటడుగులు వేస్తూ, లేస్తూ, పడుతూ అవి చేస్తున్న అల్లరి జూ సిబ్బందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ సమాచారం తెలిపారు.