వేములవాడలో దారుణం... కేవలం చికెన్ కోసం పదిమందిపై యాసిడ్ దాడి

సిరిసిల్ల: కేవలం చికెన్ కోసం షాప్ యజమానితో గొడవకు దిగిన కొందరు అతి దారుణంగా వ్యవహరించారు. కర్రలతో చికెన్ షాప్ యజమానితో పాటు మరికొందరు స్థానికులపై దాడిచేసి తలలు పగులగొట్టారు. అంతటితో ఆగకుండా యాసిడ్ దాడికి కూడా తెగబడ్డారు. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో కొందరు చిన్నచిన్న షెడ్ లు ఏర్పాటుచేసుకుని చిరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ చిరువ్యాపారులు గురువారం రాత్రి వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పపూర్ గ్రామంలోని హరీష్ చికెన్ సెంటర్లో చికెన్ కొనుగోలు చేసారు. అయితే ఇంటికెళ్లిన తరువాత చికెన్ నాణ్యతగా లేదంటూ షాపు వద్దకు వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కర్రలతో చికెన్ షాప్ యజమానితో పాటు మరికొందరిపై విచక్షణారహితంగా దాడిచేయడమే కాదు యాసిడ్ దాడికి కూడా పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన పదిమంది ప్రస్తుతం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
First Published Apr 1, 2022, 12:17 PM IST | Last Updated Apr 1, 2022, 12:17 PM IST