Asianet News TeluguAsianet News Telugu

లంచం తీసుకుంటూ... ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏఎస్సై

కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి పోలీస్ ఏసిబికి చిక్కాడు.  

First Published Jun 25, 2021, 2:32 PM IST | Last Updated Jun 25, 2021, 2:32 PM IST

కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి పోలీస్ ఏసిబికి చిక్కాడు.  గంగాధర మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లోనే లంచం తీసుకుంటూ ఎఎస్సై చంద్రారెడ్డి ఎసిబికి చిక్కాడు. మండలంలోని లింగంపల్లిలో రెండు వర్గాలు గొడపవడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే ఈ కేసు నిమిత్తం ఓ వర్గానికి చెందిన జుర్రు రాజమల్లు అనే వ్యక్తికి ఏఎస్సై లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతడు ఏసిబిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో  గంగాధర పోలీస్ స్టేషన్లో ఏఎస్సై పదిహేను వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.