కొబ్బరి గోడౌన్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు...
కరీంనగర్ జిల్లా : కరీంనగర్ బైపాస్ లోని భారత్ బెంజ్ షోరూమ్ పక్కన ఉన్న కొబ్బరి గోడౌన్ లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన గోడౌన్ పక్కనే మరో రెండు గోడౌన్ లు ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.