Asianet News TeluguAsianet News Telugu

హస్తినకు చేరిన తమిళిసై, కేసీఆర్ పంచాయతీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసైకి మధ్య చోటు చేసుకున్న పంచాయతీ హస్తినకు చేరుకుంది. 

First Published Apr 8, 2022, 10:53 AM IST | Last Updated Apr 8, 2022, 10:53 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసైకి మధ్య చోటు చేసుకున్న పంచాయతీ హస్తినకు చేరుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాని మోడీని కలిసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీరుపై బహిరంగ విమర్శలకు దిగారు. గురువారం హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత మరింత తీవ్రంగా మాట్లాడారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తనను తెలంగాణ ప్రభుత్వం 
అవమానించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకపోవడంపై విమర్శలు చేశారు. అన్ని విషయాల మీద కేసీఆర్ తో తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందనేది వేచి చూడాల్సిందే.