Asianet News TeluguAsianet News Telugu

టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (వీడియో)

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం కెనడా సాంస్కృతిక విభాగం తంగేడు ఆధ్వర్యంలో టొరంటో నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు కెనడాలో స్థిరపడిన తెలంగాణ ప్రజలు కుటుంబాలతో సహా సుమారు 600 మంది హాజరయ్యారు.

తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం కెనడా సాంస్కృతిక విభాగం తంగేడు ఆధ్వర్యంలో టొరంటో నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు కెనడాలో స్థిరపడిన తెలంగాణ ప్రజలు కుటుంబాలతో సహా సుమారు 600 మంది హాజరయ్యారు.

మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి ఆడిపాడి.. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని పిల్లలకు తెలిపారు. తర్వాత సాంప్రదాయ తెలంగాణ వంటకాలతో మంచి రుచికరమైన భోజనాలు కూడా వడ్డించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ,బంగారు తెలంగాణా అభివృద్ధికి కి పాటు పడుతూనే , తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్య క్రమాలను చేస్తూ ఉంటామని తెలుపుతూ కార్య క్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫౌండేషన్ కమిటీ చైర్మన్ గంటా మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేందర్, అధ్యక్షులు పిణీకేశి అమిత రెడ్డి, ఉపాధ్యక్షులు మూల కవిత తదితరులు పాల్గొన్నారు. 

Video Top Stories