కేవలం 10సెకన్లలోనే... పేకమేడలా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్
నోయిడా : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత విజయవంతంగా పూర్తయ్యింది.
నోయిడా : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత విజయవంతంగా పూర్తయ్యింది. భారీగా గుమిగూడిన ప్రజలు, అధికారులు, మీడియా కెమెరాల మధ్య దుమ్ముధూళిని వెదజల్లుతూ రెండు టవర్స్ పేకమేడలా కుప్పకూలాయి. కుతుబ్ మినార్ కంటే ఎత్తయిన ఈ రెండు టవర్స్ నిర్మించడానికి ఏళ్లు పడితే కూల్చివేతకు కేవలం 10 సెకన్ల సమయం పట్టింది. ఈ టవర్స్ కూల్చివేత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తపడ్డ అధికారులు కొన్ని నిమిషాల ముందు సైరన్ మోగించారు. భారీ పేలుడు పదార్థాలతో జరిగిన ఈ కూల్చివేత ప్రక్రియ సజావుగా సాగడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.