Asianet News TeluguAsianet News Telugu

527 మంది జవాన్ల ప్రాణత్యాగ ఫలితం... విజయ్ దివస్ (వీడియో)

సంప్రదాయ యుద్ధంలో మన్నలి గెలవలేమని భావించిన పాకిస్తాన్.. దొడ్డిదారిలో భారత్‌ను దెబ్బకొట్టాలని తరచుగా ప్రయత్నిస్తూనే ఉండేది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని కార్గిల్ సెక్టార్‌లో పాకిస్తాన్ ముష్కరుల్ని, సైన్నాన్ని మోహరించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ చొరబాటుదారుల్ని తరిమికొట్టేందుకు భారత సైన్యం 1999 మే 3న ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది. 

గడ్డకట్టే చలిలో.. పూర్తిగా పర్వత ప్రాంతాల్లో.. ఏ మాత్రం సహకరించని వాతావరణంలో దాదాపు 60 రోజుల పాటు భారత సైన్యం పోరాడింది. జవాన్ల త్యాగాల ఫలితంగా జూలై 26, 1999న తిరిగి కార్గిల్ సెక్టార్ భారత వశమైంది. ఈ విజయానికి గుర్తుగా జూలై 26ను విజయ్ దివస్‌గా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు.