ఈ యువకులు అద్భుతం చేశారు.. ఏకంగా గణపతినే భూమికి దింపారు..
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని బాలే గ్రామ యువకులు వినాయకుడిపై తమకున్న భక్తిని పెద్ద స్థాయిలో చాటుకున్నారు.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని బాలే గ్రామ యువకులు వినాయకుడిపై తమకున్న భక్తిని పెద్ద స్థాయిలో చాటుకున్నారు. అర ఎకరం పొలంలో గణపతి బప్ప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తమ సత్తా చాటారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రోన్ కెమెరాతో మాత్రమే పూర్తిగా చూడగలిగిన ఈ అద్భుతాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 'బాబా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌దేవ్' అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది రూపొందించడానికి దాదాపు నెల సమయం పట్టిందట.