Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పౌరులందరి ప్రాథమిక హక్కు

ఇంతకు ముందు సోషల్ మీడియా పోస్టుపై అరెస్టయిన వ్యక్తిని విచారించకుండా ఉండాలని త్రిపుర హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

ఇంతకు ముందు సోషల్ మీడియా పోస్టుపై అరెస్టయిన వ్యక్తిని విచారించకుండా ఉండాలని త్రిపుర హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది ల్యాండ్ మార్క్ గా మారింది. ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అరెస్టులకు పాల్పడకూడదని చీఫ్ జస్టిస్ అకిల్ కురేషి తెలిపారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన పోస్టుపై కాంగ్రెస్ యువ కార్యకర్త అరిందం భట్టాచార్జీని అరెస్టు చేసి వేధించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఆన్‌లైన్ ప్రచారాన్నిభట్టాచార్జీ తన ఫేస్‌బుక్ పేజీలో  విమర్శించారు. అందులో ఇచ్చిన భట్టాచార్జి ఫోన్ నంబర్‌కు పొరపాటున కూడా డయల్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.

Video Top Stories