Asianet News TeluguAsianet News Telugu

నిర్మలా సీతారామన్ కు భర్త చిక్కులు (వీడియో)

ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది?

ఎందుకంటే ఈ వ్యాసం రాసింది స్వయానా ఆర్ధిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ కాబట్టి. ఆర్ధిక మంత్రేమో ఒక పక్క ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ, తమ ప్రభుత్వం  తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్ధిక ప్రగతి పథంలో దేశం దూసుకుపోతుందని చెబుతుంటే, ఇలా ఆమె భర్త ఆర్ధిక వ్యవస్థ దిగజారిందనడంతో ఈ వ్యాసం వివాదాస్పదమయ్యింది. 

బీజేపీ పార్టీ విధి విధానాలను పరిశీలించినా, బీజేపీ గత చరిత్ర చూసినా మనకు అర్ధమయ్యే విషయం ఒక్కటే. ఈ వివాదం ఎంత పెద్దదవుతుంది? ఆ దుమారం ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు మోడీ సర్కార్ ను ప్రేరేపిస్తుంది?

Video Top Stories