Asianet News TeluguAsianet News Telugu

Video : ఘోరం..హత్యాచారం చేసి చెట్టుకు వేల్లాడదీశారు...

గుజరాత్ లో జరిగిన నిర్భయలాంటి దుర్ఘటన ఉలిక్కిపడేలా చేసింది. 

గుజరాత్ లో జరిగిన నిర్భయలాంటి దుర్ఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తర గుజరాత్ లో ఓ పందొమ్మిదేళ్ల దళిత యువతిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. ఆత్మహత్యలా చిత్రించడానికి ఆమె మెడకు తాడు బిగించి ఓ చెట్టుకు వేలాడదీశారు.బుధవారం అహ్మదాబాద్  సివిల్ హాస్పిటల్ లోని ఓ డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేశారు. ఆ అమ్మాయిది ఆత్మహత్యకాదు, హత్య అనే అనుమానంతో పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాతే ఈ పోస్టుమార్టం జరిగింది. బాధితురాలిని నలుగురు ఈ నలుగురు కిడ్నాప్ చేశారు. ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసి ఆ తరువాత హత్య చేశారు. అంతేకాదు ఆ హత్యను ఆత్మహత్యలా కనిపించేలా చేయాలని బాధితురాలి శరీరాన్ని ఓ చెట్టుకు వేలాడదీశారు.