Asianet News TeluguAsianet News Telugu

భుజాన వరి కావడి, ఒంటిపై నల్లబట్టలు... డిల్లీ నిరసన దీక్షకు ఎమ్మెల్యే సండ్ర విచిత్ర వేషం

న్యూడిల్లి: తెలంగాణ  రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనల బాట పట్టిన విషయం తెలిసిందే.  గతకొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన అధికార టీఆర్ఎస్ నేడు ఏకంగా దేశ రాజధాని డిల్లీలోనే ఆందోళనకు దిగారు. పార్టీ అదిష్టానం నిర్ణయంతో డిల్లీలోని తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ నిరసన దీక్షకు నల్లబట్టలు, వరి కావడితో విచిత్రమైన వేషధారణలో హాజరయ్యారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.  వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,  కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా ర్యాలీగా దీక్షాస్థలికి చేరుకున్నారు. 
 
First Published Apr 11, 2022, 11:52 AM IST | Last Updated Apr 11, 2022, 11:52 AM IST