ఆదివారం ఏప్రిల్ 5.. రాత్రి తొమ్మిదిగంటలు..దీపాలే వెలిగిద్దాం మనం...
లాక్ డౌన్ తొమ్మిది రోజులకు చేరుకున్న సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
లాక్ డౌన్ తొమ్మిది రోజులకు చేరుకున్న సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం నాడు దేశంలోని 130 కోట్లమంది ప్రజలు ఒకపని చేయాలని సూచించారు. ఆ రోజు రాత్రి తొమ్మిదిగంటలకు తొమ్మిది నిమిషాలపాటు ఇంట్లోని దీపాలన్నీ ఆర్పేసీ దర్వాజ దగ్గరకానీ, బాల్కనిలో కానీ క్యాండిల్, దీపం, టార్చ్ లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించమని సందేశం ఇచ్చారు. దీనివల్ల ప్రజల ఏకత్వ బలం తెలుస్తుందని..మనం ఒంటరికాదు..ఎవ్వరూ ఒంటరి కాదు అనే సందేశం ఇవ్వొచ్చని అన్నారు. అయితే దీన్ని గుంపులుగా చేయద్దని ఎవరి ఇంట్లో వాళ్లే ఉండి చేయాలని పిలుపునిచ్చారు.