ఇస్రో ఖాతాలో మరో అద్భుత విజయం... ఒకేసారి నింగికెగిసిన 36 ఉపగ్రహాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి ప్రపంచ దేశాలను తన సత్తా ఏంటో చాటిచెప్పింది.

First Published Oct 23, 2022, 12:18 PM IST | Last Updated Oct 23, 2022, 12:18 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి ప్రపంచ దేశాలను తన సత్తా ఏంటో చాటిచెప్పింది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో ఏకంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. నెల్లూరులోని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుండి అర్ధరాత్రి నిప్పులుగక్కుతూ జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో మూడు విదేశాలకు చెందినవి.  ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం భారత ఆత్మనిర్భరతకు ఉదహరణగా ప్రధాని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ దేశాలకు మన దేశ సత్తాను చాటిందని ప్రధాని మోదీ తెలిపారు. ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.