Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : ఇండో-నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్

కరోనావైరస్  కారణంగా ఇండో-నేపాల్ సరిహద్దులోని బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద వైద్య బృందాలను మోహరించాయి. 

కరోనావైరస్  కారణంగా ఇండో-నేపాల్ సరిహద్దులోని బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యగా వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద వైద్య బృందాలను మోహరించాయి. నేపాల్‌తో సరిహద్దులు పంచుకునే అన్ని జిల్లాలు అప్రమత్తమయ్యాయి.  డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులు తొందరగా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది.  నేపాల్‌లో ఇప్పటికే 1-2 కేసులు నమోదయ్యాయి. వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నేపాల్లో ఈ కరోనావైరస్ ఎక్కువగా వ్యాపిస్తే అది మనందరికీ హెచ్చరిక అని డాక్టర్లు అంటున్నారు.