భారతీయుల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన JRD టాటా
అది1932 అక్టోబరు 15.. కరాచీ నుంచి మద్రాసుకు పస్ మాత్ విమానం వెళ్లింది. భారతీయుడు నడిపిన తొలి విమానం ఇదే.
అది1932 అక్టోబరు 15.. కరాచీ నుంచి మద్రాసుకు పస్ మాత్ విమానం వెళ్లింది. భారతీయుడు నడిపిన తొలి విమానం ఇదే. ఆ వ్యక్తి ఎవరంటే.. 28 ఏళ్ల జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా(JRD Tata). ఆయనే.. భారతదేశపు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూపును అర్ధ శతాబ్దం పాటు నడిపించారు. అలాగే భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న గెలుచుకున్న ఏకైక పారిశ్రామికవేత్త.JRD Tata.. ఇరాన్ నుంచి అనేక శతాబ్దాల క్రితం శరణార్థులుగా వచ్చిన ధనిక పార్సీ కుటుంబంలో పారిస్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు రతన్‌జీ దాదాభోయ్ టాటా, సూని సుజానే. రతన్‌జీ.. టాటా సన్స్ ప్రఖ్యాత వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటాకు దగ్గరి బంధువు. లండన్, ఫ్రాన్స్‌లలో విద్యాభ్యాసం తర్వాత జేఆర్‌డీ.. ఇండియాకు వచ్చారు. ఫ్రెంచ్ పౌరసత్వాన్ని వదులుకుని పూర్తిస్థాయి భారతీయుడిగా మారారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయునిగా నిలిచారు. మూడు సంవత్సరాల తరువాత అతను భారతదేశపు మొట్టమొదటి విమానయాన సంస్థను స్థాపించారు.