Asianet News TeluguAsianet News Telugu

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం... భక్తులతో పోటెత్తిన పుణ్యక్షేత్రాలు..!

కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

First Published Jun 19, 2023, 1:00 PM IST | Last Updated Jun 19, 2023, 1:00 PM IST

కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళలకు ప్రయాణం ఉచితం అవడంతో కుటుంబ సభ్యులంతా కలిసి కూడా ప్రయాణాలను చేయడం మొదలుపెట్టారు. తాజాగా, కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల లకు భక్తులు పోటెత్తారు. బస్సులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి కూడా సమయం అధికంగా పడుతుంది.