ఇక సెలవు: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి
ప్రణబ్ ముఖర్జీ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో డిసెంబర్ 11,1935 న పశ్చిమ బెంగాల్ లో జన్మించారు.
ప్రణబ్ ముఖర్జీ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో డిసెంబర్ 11, 1935 న పశ్చిమ బెంగాల్ లో జన్మించారు. ప్రణబ్ తల్లి పేరు రాజలక్ష్మి, తండ్రి పేరు కింకర్ ముఖోపాధ్యాయ .అతని తండ్రి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు.ప్రణబ్ కుమార్ ముఖర్జీ రాజకీయవేత్త , మన ఇండియా పదమూడవ రాష్ట్రపతి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు . తన 60 సంవత్సరాల రాజకీయ జీవిత కాలంలో భారత ప్రభుత్వానికి అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు మరియు పదవులను నిర్వహించారు. . సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లోప్రణబ్ తన ప్రత్యర్థి అభ్యర్థి పి.ఎ. సంగ్మాను ఓడించి, 25 జూలై 2012 న భారత పదమూడవ రాష్ట్రపతిగాప్రమాణ స్వీకారం చేశారు.