Asianet News TeluguAsianet News Telugu

కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్‌ : కోచ్ బి 5..సీట్ నంబర్ 64..దేవుడు కనిపిస్తాడు...

కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్ లో మొట్టమొదటిసారిగా చిన్నపాటి శివాలయం వెలిసింది. 

కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్ లో మొట్టమొదటిసారిగా చిన్నపాటి శివాలయం వెలిసింది. రైలులో కోచ్ బి 5 లోని సీట్ నంబర్ 64ను శివుడి కోసం రిజర్వు చేశారు. ఈ రైలును ఫిబ్రవరి 16 న వీడియో-కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు వారణాసి ఇండోర్ మధ్య లక్నో మీదుగా 1,131 కిలోమీటర్లు, వారణాసి, ఇండోర్ మధ్య 1,102 కిలోమీటర్ల దూరం ప్రయాగరాజ్ (అలహాబాద్)మీదుగా సుమారు 19 గంటలు ప్రయాణించనుంది.