రైతుల ఆందోళనలు: మోడీకి వ్యతిరేకంగా మహిళల అభ్యంతరకర నినాదాలు (వీడియో)
కొత్త వ్యవసాయ చట్టాలను దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకి చేరుకుంది. ఢిల్లీ- జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధించడంతోపాటు హర్యానాలోని టోల్‌ప్లాజాను ముట్టడించాలని రైతు సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు
కొత్త వ్యవసాయ చట్టాలను దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకి చేరుకుంది. ఢిల్లీ- జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధించడంతోపాటు హర్యానాలోని టోల్‌ప్లాజాను ముట్టడించాలని రైతు సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆ క్రమంలో గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈ ఆందోళనలో పాల్గొన్న రైతులు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.