Asianet News TeluguAsianet News Telugu

కారుతో సహా ఇంట్లోకి దూసుకొచ్చిన వ్యక్తి.. పీకలదాకా తాగి..

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ వ్యక్తి పీకలదాకా మందుతాగి కారు నడిపాడు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ వ్యక్తి పీకలదాకా మందుతాగి కారు నడిపాడు. లాక్‌డౌన్ ఉల్లంఘించడమే కాకుండా.. టీ జంక్షన్‌లో ఉన్న ఓ ఇంటి గోడలను ఢీకొట్టి నేరుగా హాల్‌లోకి దూసుకెళ్లాడు. ప్రమాదం దాటికి  గోడ కూలిపోయింది. రాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన ఈ ఘటనలో అంతా బెడ్రూమ్‌లో నిద్రపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. అయితే, ఇంట్లో పార్క్ చేసిన వాహనాలు మాత్రం తుక్కుతుక్కయ్యాయి. ఘటన స్థలికి చేరిన పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి. మద్యం మత్తులో అతడి నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు. ఈ వీడియోను చూస్తే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.