Asianet News TeluguAsianet News Telugu

తాగిన మత్తులో పామును చీల్చి చెండాడిన మందుబాబు..

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఫుల్ గా మద్యం తాగిన ఆ వ్యక్తి ఇంటికి వెళ్లేందుకు బైక్ దగ్గరకు వచ్చాడు. 

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఫుల్ గా మద్యం తాగిన ఆ వ్యక్తి ఇంటికి వెళ్లేందుకు బైక్ దగ్గరకు వచ్చాడు. అయితే బైక్ కు అడ్డంగా పాము ఉండటంతో కోపంతో రగిలిపోయాడు. ఆపామును చేతులతో పట్టుకుని అందరూ చూస్తుండగానే కొరికి చంపాడు. నోటితో పాము తలకొరికి నానా రచ్చ రచ్చ చేశాడు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కోలార్ జిల్లా ముష్టూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో మద్యం షాపులు తెరుచుకోవడంతో మద్యం తాగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మందుబాబు పామును తలతో కొరికి చీల్చి చెండాడిన పరిస్థితిని చూసిన స్థానికులు భయాందోళన చెందారు. అయితే అదృష్టవశాత్తు మందుబాబుకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.