ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో అయోధ్య రామాలయం నమూనాకు సాధువుల ఆమోదం
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ నమూనాను ఎవరు తయారు చేశారు? ఎవరు ఆమోదించారు? ఎప్పటినుంచి అందుబాటు ఉంది? ఏఏ మార్పులు జరిగాయి?
అయోధ్య : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతినుంచే అయోధ్య రామమందిరం వివాదం మొదలయ్యింది. దశాబ్దాల తరువాత ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రారంభ పవిత్రోత్సవం 22 జనవరి 2024న జరుగుతుంది. నిర్మాణం సమయంలో అయోధ్యకు వెళ్లినవారికి కరసేవకపురంలోని ఒక భవనంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆలయ నమూనా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రారంభం కాబోతున్న శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనా ఎలా తయారు చేయబడిందో చూద్దాం.