DefExpo 2022: డిసెంబర్ 2022 నాటికీ ఐదవ తరం భారతీయ యుద్ధవిమానం డిజైన్ సిద్ధం..!

దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

First Published Oct 18, 2022, 5:23 PM IST | Last Updated Oct 18, 2022, 5:23 PM IST

దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత్ చేస్తున్న ప్రయత్నాలు.. రాబోయే నెలల్లో నెక్ట్స్ జ‌న‌రేష‌న్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో (ఏఎంసీఏ) రాబోయే నెలల్లో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నాయి. ఏఎంసీఏ క్లిష్టమైన డిజైన్ సమీక్ష డిసెంబర్ నాటికి పూర్తవుతుందని డీఆర్‌డీవో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. 

డిఫెన్స్ ఎక్స్‌పో 2022లో డీఆర్‌డీవో ఏఎంసీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏకే ఘోష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నెక్ట్స్ జనరేషన్ తర్వాతి తరం ఏఎంసీఏ మొదటి నమూనా మూడేళ్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొదటి విమానానికి మరో ఏడాదిన్నర సమయం పట్టవచ్చని తెలిపారు. 

‘‘భారతీయ ఇన్వెంటరీలోకి ప్రవేశించనున్న మొదటి ఐదవ తరం విమానంగా ఇది నిలవనుంది. అందుకే ఆ అంశంలో ఇది ప్రత్యేకమైనది. నేడు ఐదవ తరం విమానాలను అభివృద్ధి చేసిన దేశాలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయి. మా డిజైన్ ప్రక్రియ పూర్తయింది. మేము విస్తృతమైన ప్రక్రియ ద్వారా వెళ్తున్నాం. చాలా ధ్రువీకరణ పరీక్షలు జరిగాయి. మేము ప్రస్తుతం క్లిష్టమైన డిజైన్ సమీక్ష ప్రక్రియలో ఉన్నాం. అది ముగిసిన తర్వాత.. మేము అభివృద్ధికి సిద్ధంగా ఉన్నాం’’ ఏకే ఘోష్ చెప్పారు.