మిగ్ 29, జాగ్వర్, మిరాజ్ యుద్ధ విమానాల స్థానంలో 2035 నాటికి LCA MK2 లు వచ్చేస్తాయి - ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుస
భారత వైమానిక దళం 2035 నాటికి 15 యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లను రిటైర్ చేయనుంది.
భారత వైమానిక దళం 2035 నాటికి 15 యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లను రిటైర్ చేయనుంది. అదే సమయంలో వాటి స్థానాన్ని లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే2 వెర్షన్‌తో భర్తీ చేయాలని చూస్తుంది. జాగ్వార్ యుద్ధ విమానం ఆరు స్క్వాడ్రన్లకు 2025 నుంచి 2032 వరకు దశలవారీగా వీడ్కోలు పలకనున్నారు. మిగ్-21 మూడు స్క్వాడ్రన్‌లు 2024 నాటికి రిటైర్ కానున్నాయి. ఆ తర్వాత మిరాజ్ 2000, మిగ్-290 లకు చెందిన మూడు చొప్పున స్క్వాడ్రన్‌లకు వచ్చే దశాబ్దం చివరి వరకు దశలవారీగా వీడ్కోలు పలకనున్నారు.2035 నాటికి.. మిగ్-29, మిరాజ్ - 2000, జాగ్వార్‌ల.. అన్ని స్క్వాడ్రన్‌లను దశలవారీగా రిటైర్ చేయనున్నారు. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే2 మొదటి నమూనా 2023 డిసెంబర్ నాటికి విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. డీఆర్‌డీవో 2024 డిసెంబర్‌లో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్‌సీఏ) ఎంకే2 మొదటి విమానానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అలాగే 2027 నాటికి నాలుగు నమూనాలను రూపొందించాలని భావించింది. ఈ దశాబ్దం చివరి నాటికి.. ఈ విమానం సేవలో చేరుతుందని భావిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ వివరాలను మరింత తెలుసుకోవడానికి ఏషియా నెట్ న్యూస్ ఎల్‌సీఏ ఎంకే2 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వీ మధుసూదనరావుతో మాట్లాడింది. ‘‘ఎల్‌సీఏ ఎంకే2 అనేది.. ఎల్‌సీఏ ఎంకే1, ఎంకే1 ఆల్ఫాతో సమానమైనది కాదు. ఇది ఒక కొత్త డిజైన్. దేశంలోని(భారత వైమానిక దళం) మిరాజ్ 2000, మిగ్-29, జాగ్వార్ యుద్ధ విమానాల స్థానంలో భర్తీ చేసేలా.. కొత్త డిజైన్‌లో సామర్థాల్యను మెరుగుపరించింది. ఈ విమానం 6.5 టన్నుల ఆయుధాలను మోయగలదు. 11 హార్డ్ పాయింట్లను కలిగి ఉంటుంది. అయితే Mk1 ఏడు హార్డ్ పాయింట్లను కలిగి ఉంటుంది’’ అని వీ మధుసూదనరావు చెప్పారు.ఆ పూర్తి ఇంటర్వ్యూ మీకోసం...