Happy Christmas : శాంతియుత జీవన సందేశమే క్రిస్మస్
పశువుల పాకలో బాలయేసు పుట్టినరోజు.
పశువుల పాకలో బాలయేసు పుట్టినరోజు. పశువుల కాపరుల ద్వారా లోకానికి తెలిసిన రోజు. గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన క్రీస్తు జన్మదినంగా ప్రపంచ క్రైస్తవులు పాటిస్తారు. క్రిస్మస్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది శాంతాక్లాజ్. తెల్లటి గడ్డంతో ఎర్రటి దుస్తుల్లో బహుమతులు తీసుకువచ్చే క్రిస్మస్ తాత అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం. రెండోది క్రిస్మస్ ట్రీ. ప్రతి ఒక్కరు ఇంట్లో క్రిస్మస్ ట్రీని పెట్టి రకరకాల రంగుల బల్బులు, గిప్టులు, స్టార్లు, పేపర్లతో అందంగా అలంకరిస్తారు.