Asianet News TeluguAsianet News Telugu

చారిత్రక సంబంధాల పునరుద్ధరణ (వీడియో)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులోని మామిళ్లపురం చేరుకుంటారు. భారతప్రధాని నరేంద్రమోడీతో అనధికారిక భేటీ అవుతారు. గత ఏప్రిల్ లో చైనాలోని వ్యూహన్ లో మొదటిసారి మోడీతో భేటీ అయిన జిన్ పింగ్ రెండోసారి భేటీకి ఇండియా వచ్చారు.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులోని మామిళ్లపురం చేరుకుంటారు. భారతప్రధాని నరేంద్రమోడీతో అనధికారిక భేటీ అవుతారు. గత ఏప్రిల్ లో చైనాలోని వ్యూహన్ లో మొదటిసారి మోడీతో భేటీ అయిన జిన్ పింగ్ రెండోసారి భేటీకి ఇండియా వచ్చారు. 

చెన్నైకి  56 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపురంలో రెండు రోజుల ఈ భేటీ జరగనుంది. మల్లాపురం చారిత్రకవారసత్వం ఉన్న తీర ప్రాంతపట్టణం. 1600 సంవత్సరాల క్రితం చైనాతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఈ భేటీ వల్ల అలాంటి చారిత్రక విశేషాలు మరోసారి గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది.

నేటి మల్లాపురమే ఒకప్పటి మహాబలిపురం. మహాబలిపురాన్ని పాలించిన పల్లవరాజులకు చైనాతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఏడవశతాబ్దంలో చైనా, దక్షిణ ఆసియాలతో పల్లవరాజులు చేసే వ్యాపారానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులకు ఈ చారిత్రక నగరమే గేట్ వేగా పనిచేసింది. చైనా సిల్క్ రూట్ అని చెప్పుకునే దాంట్లో ఇదీ ఒక భాగమే.
పట్టుకు ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఒకప్పుడు పల్లవరాజుల రాజధానిగా ఉండేది. మొదట్లో ఇక్కడి పట్టు వ్యాపారానికి కావాల్సిన ముడిసరుకును చైనా నుండే దిగుమతి చేసుకునేవారని నమ్మకం.

చైనాతో మనకున్న ప్రాచీన సంబంధాలు, నాగరికతా పరమైన సంబంధాలను పెంపొందించుకునే దిశగా ఈ భేటీ పనిచేస్తుందని భారత్ ఆశిస్తోంది. ఏడవశతాబ్దంలో చైనాకు చెందిన హ్యు థ్యాంగ్ అనే యాత్రికుడు కాంచీపురంను సందర్శించాడు. ఈ సమయంలో ఎంతో కోలాహలంగా ఉన్న మహాబలిపురం ఓడరేవులోనే ఆయన దిగాడు. తన యాత్రా విశేషాల్లో ఆయన వీటిని ప్రస్తావించాడు. అంతేకాదు పల్లవ రాజ్య వైభవం, బౌద్ధఆరామాల్లో నేర్చుకునే పద్ధతులనూ ప్రస్తావించాడు.

చైనాలోని ప్రతిష్టాత్మక లేక్ సిటీ అయిన వ్యూహన్ లో భారతప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మొదటి భేటీ జరిగింది. గతేడాది డోక్లమ్ లో రెండు దేశాల సైన్యం 73 రోజులపాటు తలపడ్డ కొద్ది నెలల తరువాతే ఈ భేటీ జరిగింది. 

ఈ మీటింగ్ వల్ల రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలు మెరుగుపడడానికి సరిహద్దుల్లో శాంతి ముఖ్యం అని ఇరుదేశాలూ అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతిసౌభ్రాతృత్వాలకోసం మరిన్ని కొత్తరకమైన మార్గదర్శకాలు నిర్దేశించుకున్నాయి. 
పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తో భేటీ తరువాత రెండు రోజులకు ఈ భేటీ జరగనుంది. కాశ్మీర్ అంశం మీద వీరిద్దరి భేటీ జరిగింది.