Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ జర్నలిస్ట్ అఖిలా నందకుమార్ పై తప్పుడు కేసును ఖండించిన మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఏషియానెట్ న్యూస్ జర్నలిస్ట్ అఖిలా నందకుమార్ పై తప్పుడు కేసును కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. 

First Published Jun 13, 2023, 12:54 PM IST | Last Updated Jun 13, 2023, 12:54 PM IST

ఏషియానెట్ న్యూస్ జర్నలిస్ట్ అఖిలా నందకుమార్ పై తప్పుడు కేసును కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... 'కమ్యూనిస్టు ప్రభుత్వం, సీపీఐ(ఎం) భావజాలం పూర్తిగా నయవంచన, వైరుధ్యాల మీద నిర్మించిన ఇల్లు వంటివి. బీబీసీ నుంచి ఒక డాక్యుమెంటరీ వచ్చినప్పుడు వారు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి భావోద్వేగంగా స్టేట్‌మెంట్లు ఇస్తారు. అదేసమయంలో వారు అధికారంలో ఉన్న కేరళలో ఒక జర్నలిస్టు దేని గురించో రిపోర్ట్ చేస్తే ఉన్నపళంగా అది భావప్రకటన స్వేచ్ఛ కాకుండా పోతుంది. వారు ఆ స్వేచ్ఛనే విస్మరిస్తారు. కేరళలోని సీపీఎం ప్రభుత్వం అబద్ధాలు, కపటత్వం మీద ఏర్పడింది' అని అన్నారు.