Asianet News TeluguAsianet News Telugu

శబరిమల నుంచి తిరిగివస్తూ లోయలో పడ్డ ఏపీ భక్తుల బస్సు

శబరిమల : శబరిమలకు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. 

First Published Nov 19, 2022, 12:00 PM IST | Last Updated Nov 19, 2022, 12:05 PM IST

శబరిమల : శబరిమలకు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని పతనంతిట్ట సమీపంలో లోయలో పడిపోయింది. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అందులో ఓ చిన్నారి సహా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు కొండ ఎక్కుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియవలసి ఉంది. శబరిమల దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు.