చిట్టడవిలో 12 కి.మీ డోలీ మోసి... వృద్దుడి ప్రాణాలు కాపాడిన బిఎస్ఎఫ్ జవాన్లు

మల్కన్ గిరి : దేశసేవ కోసం ఆర్మీలో చేరి పరోక్షంగా ప్రాణాలుకాపాడే ఆర్మీ జవాన్లు ప్రత్యక్షంగానూ ఓ వృద్దుడి ప్రాణాలు కాపాడారు. 

First Published Oct 3, 2022, 3:23 PM IST | Last Updated Oct 3, 2022, 3:23 PM IST

మల్కన్ గిరి : దేశసేవ కోసం ఆర్మీలో చేరి పరోక్షంగా ప్రాణాలుకాపాడే ఆర్మీ జవాన్లు ప్రత్యక్షంగానూ ఓ వృద్దుడి ప్రాణాలు కాపాడారు. అటవీ ప్రాంతంలో దిక్కులేని స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడున్న వృద్దున్ని చూసి చలించి పోయిన బిఎస్ఎఫ్ జవాన్లు పెద్దమనసు చాటుకున్నారు. వ‌ృద్దిని డోలీలో వేసి కొండలు, కోనలు, వాగులు దాటుకుంటూ ఏకంగా 12 కిలోమీటర్లు తమ భుజాలపై మోసారు. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కన్ గిరి జిల్లా ఖైరిపుట్ ప్రాంతంలో  151 బెటాలియన్ కు చెందిన బిఎస్ఎఫ్ జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మావోయిస్టుల ఏరివేతలో భాగంగా జ‌మ‌ద్‌గుడా అడవిలోకి వెళ్లిన బిఎస్ఎఫ్ జవాన్లకు దామోదర్ సిసా అనే 70ఏళ్ల వృద్దుడు జ్వరంతో నడవలేని స్థితిలో కనిపించాడు. అతడి పరిస్థితి చూసి చలించిపోయిన జవాన్లు ఎలాగయినా అతడికి వైద్యం అందేలా చూడాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ డోలీలో అతన్ని పడుకోబెట్టి నడకకు కూడా అనువుగా లేని అడవిలో 12కిలోమీటర్లు మోసి హాస్పటల్ కు చేర్చారు. ఇలా వృద్దుడి ప్రాణాలను కాపాడిన బిఎస్ఎఫ్ జవాన్లను ప్రతిఒక్కరు ప్రశంసిస్తున్నారు.