భారత్ జోడో యాత్రలో గ్లామర్ షో... రాహుల్ తో కలిసి నడిసిన రియాసేన్
ముంబై : కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.
ముంబై : కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ జోడో యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ(గురువారం) రాహుల్ పాదయాత్ర గ్లామర్ షోతో మెరిసిపోయింది. బాలీవుడ్ బ్యూటీ రియాసేన్ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిసేపు రాహుల్ కలిసి నడుస్తూ అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రలో జోష్ నింపారు. ఇప్పటికే తెలంగాణలో సాగిన రాహుల్ పాదయాత్రలో పలువరు సినీతారలు మెరిసారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి పూజాభట్ పాల్గొన్నారు. తెలుగు హీరోయిన పూనమ్ కౌర్ కూడా రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. తాజాగా రియాసేన్ కూడా రాహుల్ తో కలిసి నడిసారు.