Asianet News TeluguAsianet News Telugu

భారత వైమానిక దళ చరిత్రలో 'రాఫెల్' అధ్యాయం..

భారత వైమానిక దళ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.

భారత వైమానిక దళ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి. మన వైమానిక దళ పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే ఐదు రాఫెల్‌ యుద్ధవిమానాలు బుధవారం మనదేశానికి చేరుకున్నాయి. భారత గగనతలంలోకి ఈ యుద్ధవిమానాలు ప్రవేశించగానే.. రెండు సుఖోయ్‌ 30 ఎంకేఐలు వాటికి ఎస్కార్టుగా ప్రయాణించి అంబాలా బేస్‌ దాకా తోడ్కొని వచ్చాయి. ల్యాండయిన ప్రతి విమానానికీ సంప్రదాయం ప్రకారం జలఫిరంగులతో స్వాగతం పలికారు. చైనా వద్ద ఉన్న యుద్ధవిమానాల కన్నా రాఫెల్‌ అత్యంత శక్తిమంతమైనది, అధునాతనమైనది, ప్రాణాంతకమైనదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

Video Top Stories