Video news : రోజురోజుకూ పెరుగుతున్న క్యాన్సర్ కేసులు...దీనికి అడ్డుకట్ట వేయాలంటే...
జాతీయ ఆరోగ్య డేటా 2019 ప్రకారం 2017, 18 సంవత్సరాల్లో నోటి క్యాన్సర్లు, సర్వైకల్, రొమ్ముక్యాన్సర్లతో పాటు మామూలు క్యాన్సర్ కేసులు 324 శాతం పెరిగాయని తేలింది. 2017లో 39వేల 635 క్యాన్సర్ కేసులు నమోదుకాగా 2018నాటికి ఈ సంఖ్య లక్షా 60వేలకు చేరుకుంది.
జాతీయ ఆరోగ్య డేటా 2019 ప్రకారం 2017, 18 సంవత్సరాల్లో నోటి క్యాన్సర్లు, సర్వైకల్, రొమ్ముక్యాన్సర్లతో పాటు మామూలు క్యాన్సర్ కేసులు 324 శాతం పెరిగాయని తేలింది. 2017లో 39వేల 635 క్యాన్సర్ కేసులు నమోదుకాగా 2018నాటికి ఈ సంఖ్య లక్షా 60వేలకు చేరుకుంది.
వేగంగా మారుతున్న జీవనవిధానం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడంలాంటి కారణాల వల్ల ఈ వ్యాధి భారిన పడేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. NCD క్లినిక్స్ కి వచ్చే జనాల సంఖ్యా పెరిగిపోతోందని తేలింది.
గుజరాత్ లో అధిక శాతం క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దీని తరువాత కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమబెంగాల్ లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 2018 లెక్కలప్రకారం తక్కువ కేసులు నమోదైన ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లు కూడా దీనికి మినహాయింపు కాదు.
నోటి క్యాన్సర్ కు ప్రధాన కారణం పొగాకు నమలడమేనని యాక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ కి చెందిన సీనియర్ ఆంకాలజిస్ట్ డా. హర్ ప్రీత్ సింగ్ అన్నారు. దీంతోపాటు కదలకుండా ఒకదగ్గర కూర్చుని పనిచేసే జీవనవిధానం, ఒబేసిటీలు కూడా అన్నిరకాల క్యాన్సర్ లుపెరగడానికి కారణాలవుతున్నాయి.
దీనిమీద జాతీయ స్థాయిలో ఓ కార్యక్రమాన్ని చేపట్టే దిశగా ఆరోగ్యమంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోంది. దీంట్లో క్యాన్సర్ రాకుండా, వచ్చిన తరువాత తీసుకునే జాగ్రత్తలు, డయాబెటిస్, గుండెసంబంధిత వ్యాధులు, గుండెనొప్పి లాంటి వాటిమీద అవగాహన కల్పిస్తారు. ఈ వ్యాధులను ముందుగా గుర్తించడం కంటే జీవనవిధానంలో కొన్ని మార్పులవల్ల అసలు రాకుండా జాగ్రత్త పడొచ్చనే అవగాహన కల్పిస్తారు.