అయోధ్య రామాలయంలో ఒక్కసారి వెలిగిస్తే 45రోజులు వెలిగే బాహుబలి అగర్ బత్తీ..
గుజరాత్, వడోదర నివాసి బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశాడు.
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ రోజున రామ మందిర మహాసమారోహే ప్రాణ స్థాపనలో దేశం నలుమూలల నుండి రామభక్తులు పాల్గొంటారు. పండుగతో పాటు.. వివిధ సాంస్కృతిక, పౌరాణిక కార్యక్రమాలు జరగనున్నాయి. యేళ్లతరబడి ఎదురుచూస్తున్న రామాలయం పవిత్ర ప్రారంభోత్సవానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దేశ,విదేశాల్లో ఉన్న రామ భక్తులు తమకు తోచిన రీతిలో ఉడతాసాయంగా రకరకాలుగా భక్తి కురిపిస్తున్నారు.