Asianet News TeluguAsianet News Telugu

సీతారామం మూవీ పబ్లిక్ టాక్ : సినిమాకో దండం, టిష్యూ పేపర్స్ తీసుకెళ్లండి భయ్యా..!

దర్శకుడు హను రాఘవపూడి  తొలి నుంచి తన ప్రయారిటీ ప్రేమ కథలకే ఇస్తూ వస్తున్నారు. 

First Published Aug 5, 2022, 2:50 PM IST | Last Updated Aug 5, 2022, 2:50 PM IST

దర్శకుడు హను రాఘవపూడి  తొలి నుంచి తన ప్రయారిటీ ప్రేమ కథలకే ఇస్తూ వస్తున్నారు. అయితే వాటిలో సక్సెస్ రేటు తక్కువే. అలాగే అవి ఓ వర్గానికే పరిమతమవుతూ వస్తున్నాయి. తాజాగా హను దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్  హీరోగా యుద్ధం నేపధ్యంలో  రూపొందిన ప్రేమకథ చిత్రం ఇది. వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సమర్పణ కావటంతో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అలాగే మంచి నటి అయిన మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించటం కూడా క్రేజ్ కు మరో కారణమైంది. ఇక దుల్కర్ కు తెలుగులో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ కాంబోలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!