రానా దగ్గుబాటి అరణ్య మూవీ రివ్యూ

అరబ్బు, ఒంటె కథ తెలిసిందే. ఒంటె మొదట అరబ్బు గుడారంలో తల దూరుస్తానంటుంది. 

First Published Mar 26, 2021, 9:15 AM IST | Last Updated Mar 26, 2021, 9:21 AM IST

అరబ్బు, ఒంటె కథ తెలిసిందే. ఒంటె మొదట అరబ్బు గుడారంలో తల దూరుస్తానంటుంది. ఆ తరువాత కొంచెం కొంచెంగా చొరబడి అరబ్బును బయటకు గెంటేస్తుంది. అలాగే  మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్‌ చెబుతోంది. అంటే ఈ భూమి నిజానికి వాటిదే. వాటిని మచ్చిక చేసుకుని మనం షేర్ చేసుకుంటున్నాం. ఒంటె కథలాగ మెల్లి మెల్లిగా భూమిని ఆక్రమించి..జంతువులను ఈ భూమి మీద నుంచి బయిటకు గెంటేస్తున్నాం. అంటే చంపేస్తున్నాం.  ఈ జంతువులను కాపాడకపోతే ప్రకృతి సంక్షోభం  వచ్చేస్తుంది. బాలెన్స్ తప్పిపోతుంది. చివరకి మనిషి మనుగడ కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ఇలాగే చెప్తే ఓ సైన్స్ పాఠం లాగ ఉంటుంది. కానీ సినిమాగా ఓ ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ...మన బుర్రలకు ఎక్కుతుందేమో..అదే ప్రయత్నం  ‘అరణ్య’ సినిమా చేసింది. ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది. అసలు  ‘అరణ్య’ కథేంటి..రానా  పాత్రేమిటి...సినిమా అందరూ చూడగలిగేటట్లే ఉందా..లేక మెసేజ్ ల మయంగా ఉందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Video Top Stories