అవార్డు వాపసీ ప్రచారం కోసమే: ప్రముఖ కవి కె. శివారెడ్డి ఇంటర్వ్యూ
నిత్య అధ్యయనం ద్వారానే నిరంతరం కవిత్వం రాయగలుగుతున్నానంటున్న కవి కె. శివారెడ్డి కొత్తగా కవిత్వం రాస్తున్న వారి కవిత్వం తప్పకుండా చదివి తీరాలంటున్నారు.
నిత్య అధ్యయనం ద్వారానే నిరంతరం కవిత్వం రాయగలుగుతున్నానంటున్న కవి కె. శివారెడ్డి కొత్తగా కవిత్వం రాస్తున్న వారి కవిత్వం తప్పకుండా చదివి తీరాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు దేశవ్యాప్తంగా పరమత సహనం తగ్గుతున్న నేపధ్యంలో దానికి నిరసనగా కొంత మంది కవులు, రచయితలు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అందిన అవార్డులను తిరిగి ఇవ్వటాన్ని (అవార్డు వాపసీ) అది ప్రచారం కోసం చేస్తున్న చర్యగా కొట్టిపారేశారు. భౌతికంగా సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్య పరచకుండా కవులు, రచయితలు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం గురించి మాట్లాడుతూ కె. శివారెడ్డి ప్రజాస్వామ్య భావజాలం గల కవులు, రచయితలు ఐక్య సంఘటనగా ముందుకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ చూడండి...