Video:తెలుగులో విమర్శ అంతరించిపోతోంది: అంపశయ్య నవీన్
విప్లవ రచయితల సంఘాన్ని బాగా మెచ్చుకుంటే తప్ప ఆ సంఘంలో ఉన్నవాళ్లు తృప్తి పడరు.
విప్లవ రచయితల సంఘాన్ని బాగా మెచ్చుకుంటే తప్ప ఆ సంఘంలో ఉన్నవాళ్లు తృప్తి పడరు. వారిలోని ఏ చిన్న లోపాన్ని ఎత్తి చూపినా వారు సహించరు అంటూ తన అనుభవాన్ని ఏసియా నెట్ న్యూస్ తో అంపశయ్య నవీన్ పంచుకున్నారు. తను తెలంగాణకు చెందిన వాడవడం వల్లనే అప్పటి ఆంధ్ర సంపాదకులు తన మొదటి నవల 'అంపశయ్య'ను వారి ప్రతికల్లో ప్రచురించలేదని బాధపడ్డారు. ఇప్పుడు కవిత్వంగా
చెప్పుకునేదంతా చాలా వరకు కవిత్వం కాదని తేల్చిచెప్పారు నవీన్. విమర్శకులు చేసే ఏ చిన్న పాటి విమర్శనైనా కవులు, రచయితలు భరించలేక అసహనం ప్రదర్శించడం వల్లనే తెలుగు సాహిత్యంలో విమర్శ అంతరించి పోయిందంటున్న అంపశయ్య నవీన్ అంతరంగాన్ని ఈ లింక్ లో మరింత తెలుసుకోండి.