బిల్ల మహేందర్ కవిత : కరోనా కాలాన్ని జయిద్దాం

తెలుగు కవిగా ప్రఖ్యాతి వహించిన బిల్ల మహేందర్ 1976, సెప్టెంబర్ 09 న వరంగల్ జిల్లా లోని వేలేరు ప్రాంతంలో జన్మించాడు. 

First Published Apr 18, 2020, 11:44 AM IST | Last Updated Apr 18, 2020, 11:44 AM IST

తెలుగు కవిగా ప్రఖ్యాతి వహించిన బిల్ల మహేందర్ 1976, సెప్టెంబర్ 09 న వరంగల్ జిల్లా లోని వేలేరు ప్రాంతంలో జన్మించాడు. ఒక వికలాంగుడిగా తను ఎదుర్కున్న సమస్యలు, అనుభవాలతో వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది కవులతో100 కవితలు రాయించి, వాటితో కాలాన్ని గెలుస్తూ.. అనే కవితా సంకలనాన్ని 2014లో వెలువరించాడు. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో వికలాంగుల గురించిన అంశంతో వచ్చిన తొలి కవితా పుస్తకంగా గుర్తింపు పొందింది, అలాగే మహేందర్ కు సంపాదకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. 2015లో కూడా అదే అంశంతో తన స్వీయ కవితలతో గెలుపు చిరునామా అనే సంపుటి ప్రచురించారు.