వీ ఆర్ విత్ యూ అంటూ ఎల్లప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటున్న స్రవంతి
కరోనా కష్టకాలంలో ప్రజల జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి.
కరోనా కష్టకాలంలో ప్రజల జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి. లాక్ డౌన్ విధించడంతో ఉద్యోగాలు కోల్పోయి, జీవనాధారం లేక అనేక మంది ప్రజలు తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బందిపడ్డారు. ఇలాంటి ప్రజల ఆకలి అవసరాలను తీర్చడానికి ముందుకొచ్చారు శ్రవంతి కాసారం. వి ఆర్ విత్ యు అనే ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రజలకు అవసరమైన సహాయాన్ని చేస్తున్నారు. తొలుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్లాస్మా, ఆక్సిజన్ ఇతరత్రాలను అందించడంలో ముందుకొచ్చారు. ఆ సందర్భంలో ఆసుపత్రుల బయట తమ వారికోసం ఎదురుచూస్తూ ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి ఏ ఒక్కరూ ఆకలితో నిద్రించకూడదు అని నిశ్చయించుకొని ప్రతిరోజు ఫుడ్ ప్యాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు.