పెదాలు నల్లగా ఉన్నాయా...ఇలా చేస్తే ఎర్రగా మెరిసే పెదాలు మీ సొంతం...

లిప్ స్టిక్ ఇష్టం లేని వారు అస్సలు ఉండరేమో. 

First Published Nov 20, 2022, 3:46 PM IST | Last Updated Nov 20, 2022, 3:46 PM IST

లిప్ స్టిక్ ఇష్టం లేని వారు అస్సలు ఉండరేమో. కొంతమంది అయితే లిప్ స్టిక్ ను పెట్టుకోనిదే.. ఇంటి బయటకు కూడా అడుగుపెట్టరు. మీకు తెలుసా.. లిప్ స్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల కూడా పెదాలు నల్లగా అవుతుంటాయి. అలాగే సూర్యరశ్మి, స్మోకింగ్ వల్ల కూడా పెదాలు నల్ల బడుతుంటాయి. కానీ పెదాలు నల్లగా అవ్వడం వల్ల ముఖం అందంగా కనిపించదు. ఇలాంటప్పుడు కొంతమంది ఎర్రని లిప్ స్టిక్ ను పెడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నల్లని పెదాలను ఎర్రగా, పింక్ కలర్ లోకి మార్చొచ్చు. అంతేకాదు ఈ పద్దతుల వల్ల మీ పెదాలు అందంగా, తేమగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..