మరణించిన కమెడియన్లు అంతా మందు పార్టీ వాసనకు టెంప్ట్ అయి కిందకు వస్తే... ఈ మిమిక్రీ వింటే నవ్వాగదు..!

మనం జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా... మనలో చిన్నప్పటినుండి ఉన్న కళలు అప్పుడప్పుడు సమయానుకూలంగా బయటకు వస్తుంటాయి..! 

First Published Sep 7, 2022, 3:03 PM IST | Last Updated Sep 7, 2022, 3:03 PM IST

మనం జీవితంలో ఏ వృత్తిలో ఉన్నా... మనలో చిన్నప్పటినుండి ఉన్న కళలు అప్పుడప్పుడు సమయానుకూలంగా బయటకు వస్తుంటాయి..! వేర్వేరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ఎందరో ఇప్పటికీ రంగస్థల నాటకాల్లో, కళాప్రదర్శనల్లో నటిస్తూ తమలోని కళాకారుడిని బయటకు తీసుకొస్తూనే ఉన్నారు..! ఈ కోవకు  చెందిన వాడే మురళీకృష్ణ. ఖమ్మం కళాకారుల గుమ్మం... అనే నానుడిని నిజం చేస్తూ... హైదరాబాద్ లో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వెలుగొందుతూనే, తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ ని ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకొస్తుంటారు. సరదాగా గణేష్ నవరాత్రోత్సవాల్లో దివికేగిన కమెడియన్లు అందరూ సరదాగా మందు వాసనకు కిందకి వచ్చి ఒక ఫంక్షన్లోకి దూరితే ఎలా ఉంటుందో అని సరదాగా ఎమ్మెస్ నుండి జేపీ వరకు అందరూ తరాల వాయిస్ లు ఇమిటేట్ చేస్తూ జనాలని కడుపుబ్బా నవ్వించాడు..! ఆ పొట్టచెక్కలయ్యే కామెడీని మీరు కూడా చూడండి..!